పండగలా కేటీఆర్ జన్మదినం

తాండూరు రాజకీయం వికారాబాద్

పండగలా కేటీఆర్ జన్మదినం
– భద్రేశ్వర దేవాలయంలో అర్చన
– రాజుగౌడ్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : భారతీయ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారాక రామారావు(కేటీఆర్) జన్మదిన వేడుకలను తాండూరులో పండగలా జరుపుకున్నారు.

గురువారం కేటీఆర్ జన్మదిన సందర్భంగా వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ తరుపున పట్టణంలోని భద్రేశ్వర దేవాలయంలో అర్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా దేవాలయంలోని దాసోహ మందిరంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు గౌడ్ మాట్లాడుతూ నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ బీఆర్‌ఎస్‌ పార్టీ, రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో కేటీఆర్ కృషి ఎంతో ఉందని అన్నారు. ఆ భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

ఆయన నాయకత్వంలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయడంకా మోగిస్తామన్నారు. ఖచ్చితంగా అన్ని స్థానాలను కైవసం చేసుకుని గులాబీ సత్తా చాటుతామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, మాజీ ఫ్లోర్ లీడర్ సుమిత్ గౌడ్, నాయకులు ఎర్రం శ్రీధర్, బీఆర్ఎస్వీ నాయకులు దత్తాద్రేయ రావు, సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు ఇండ్లు..!