షార్ట్ స‌ర్కూట్‌తో ఇల్లు ద‌గ్దం

క్రైం తాండూరు వికారాబాద్

షార్ట్ స‌ర్కూట్‌తో ఇల్లు ద‌గ్దం
– కాలి బూడిదైన వ‌స్తువులు
– రూ. 25 వేల వ‌ర‌కు ఆస్తి న‌ష్టం
పెద్దేముల్, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాళం వేసి ఉన్న ఇంట్లో షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగా మంట‌లు చెల‌రేగి అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో ఇంట్లో ఉన్న వ‌స్తువులు, ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాలు కాలి బూడిద‌య్యాడు. ఈ సంఘ‌ట‌న మంగ‌ళ‌వారం ఉద‌యం పెద్దేముల్ మండ‌ల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి. పెద్దేముల్ గ్రామానికి చెందిన హోలీయ దాసరి నాగభూషణం గ్రామాల్లో స్టీల్ సామాగ్రి విక్ర‌యిస్తూ జీవ‌నం సాగిస్తున్నాడు. మంగ‌ళ‌వారం ఆయ‌న‌ తన భార్యతో క‌లిసి స్టీల్ సామగ్రి విక్రయించేందుకు ఇంటికి తాళం వేసి
వెళ్ళిపోయారు. ఉదయం ఆరు గంటల ప్రాంతంలో విద్యుత్ వైరు షార్ట్ సర్క్యూట్ కావడంతో ప్ర‌మాద వ‌శాత్తు మంట‌లు అంటుకున్నాయి. స్థానికులు గ‌మ‌నించి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్ప‌టికే ఇంట్లో ఉన్న ఫ్రిజ్జు, టీవీ తోపాటు ఇతర సామాగ్రి పూర్తిగా మంట‌ల్లో ద‌గ్ద‌మ‌య్యాయి. ఈ అగ్ని ప్ర‌మాదంతో దాదాపు రూ. 25 వేల ఆస్తి నష్టం జ‌రిగింద‌ని బాధితులు వాపోయారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం ఇప్పించాలని బాధితుడు నాగభూషణం కోరారు.