మళ్లీ బీఆర్ఎస్సే రావాలి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మళ్లీ బీఆర్ఎస్సే రావాలి..!
– రోహిత్ రెడ్డిని గెలిపించుకుందాం
– గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి
– తాండూరు యువతే నా బలం.. బలగం
– ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– విజయవంతమైన యువ ప్రభంజనం
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలో, తాండూరులో మళ్లీ బీఆర్ఎస్సే రావాలని రాష్ట్ర గనుల, భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. తాండూరులో బీఆర్ఎస్ గెలుపులో యువత కీలకం కావాలని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆకాంక్షించారు. శనివారం తాండూరు పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో యువ ప్రభంజనం కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని తాండూరులో యువకులతో బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ఇందిరా చౌరస్తా నుంచి విలియం మూన్ మైదానం వరకు ర్యాలీ చేపట్టారు. మైదానంలో నిర్వహించిన సమావేశానికి రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని చేపట్టిందన్నారు. పేదలను ఆదుకుని ప్రజలకు సుపరిపాలన అందించిందన్నారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడం కోసం అందరు సహకరించాలన్నారు. తాండూరులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.

అదేవిధఁగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి యువతే బలం అని అన్నారు. యువకుల నాకు బలం బలగం అన్నారు. యువకులు రాజకీయాల్లోకి రావాలని అన్నారు. తాండూరులో రెండోసారి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించడంతో యువత కీలకం కావాలన్నారు. తాండూరులో ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందని, బైటోళ్లు బైటోళ్లే అవుతారని అన్నారు. అదేవిధంగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య కుమారుడు ఆర్. ఆరుణ్ కుమార్ మాట్లాడుతూ బీసీల పట్ల ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలో తన తండ్రికి ఉన్న భావాలు ఉన్నాయన్నారు. అన్నివర్గాల ప్రజల మద్దతు రోహిత్ రెడ్డికి ఉండాలని, అతన్ని భారీ మెజార్టీతో అసెంబ్లీకి పంపాలన్నారు. మరోవైపు మంత్రి మహేందర్:’ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రసంగించే సమయంలో యువత కేరింతలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, నేతలు, యువనాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

 మోసపోవద్దు గొసపడతాం..