
మనోహరన్నకు రేవంతన్న శుభాకాంక్షలు..!
– బర్త్డే విసెష్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
– జన్మదినం రోజు ఆధ్యాత్మికంలో బీఎంఆర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

మంగళవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జన్మదినం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా శుభకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా వికారాబాద్, కోడంగల్ నియోజకవర్గం పక్క అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా, పక్క నియోజకవర్గం కావడంతో ఇద్దరి మధ్య సంబంధాలు ఉన్నాయి.

ఇందులో భాగంగా మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటు అందించాలని, సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. మరోవైపు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తన జన్మదినం సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణంలో గడిపారు. తమిళనాడులోని అరుణాచలేశ్వరున్ని సతీమణి అరుణారెడ్డి, సిబ్బందితో కలిసి దర్శించుకున్నారు. దర్శనం అనంతరం గిరిప్రదక్షణ చేసి మొక్కు తీర్చుకున్నారు.



ఇదికూడా చదవండి..

