అభివృద్దే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ధ్యేయం

తాండూరు రాజకీయం వికారాబాద్


అభివృద్దే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ధ్యేయం
– కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గాజుల మాధవి
– ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా అల్పహారం పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ తాండూరు పట్టణ మహిళ అధ్యక్షురాలు గాజుల మాధవి కమలాకర్ అన్నారు.

మంగళవారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జన్మదినం సందర్భంగా పట్టణంలోని కాళికా దేవి దేవాలయం వద్ద ప్రజలకు అల్పహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గాజుల మాధవి దేవాలయ చైర్మన్ బస్వరాజ్, సభ్యులతో కలిసి అల్పహారం వితరణ చేశారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గ అభవృద్ధి ప్రధాతగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నిలుస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామిలను దశల వారిగా నెరవేరుస్తున్నారని అన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించేలా చూస్తున్నారని అన్నారు.

ప్రభుత్వం ద్వారా మహిళ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డు, గృహజ్యోతి వంటి తదితర పథకాల్లో మహిళలకు పెద్దపీట వేస్తున్నారని అన్నారు. తాండూరు రూపు రేఖలు మార్చేందుకు అహర్నిషలు శ్రమిస్తున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆరోగ్యంగా ఉండాలని, మరిన్ని పదువులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళ నాయకురాలు కోర్వార్ ప్రభావతి, దేవాలయ కమిటి సభ్యులు, నేతలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి..

పండగలా మనోహరన్న జన్మదినం