
పండగలా మనోహరన్న జన్మదినం
– భద్రేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు
– ఆసుపత్రి, దేవాలయాల్లో అన్నదానం
– పటేల్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో వేడుకలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు పండగలా జరుపుకున్నారు. మంగళవారం భద్రేశ్వర దేవాలయ రెనవేషన్ కమిటి అధ్యక్షులు, దిగ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పటేల్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో దేవాలయ కమిటి సభ్యుల సమక్షంలో వేడుకలు జరుపుకున్నారు.

మనోహర్ రెడ్డి జన్మదినం సందర్భంగా భద్రేశ్వర దేవాలయంలో ఎమ్మెల్యే పేరుపై అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా మధ్యాహ్నం దాసోహ మందిరంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. పట్టణంలోని మర్రిచెట్టు కూడలి వద్ద రక్తమైసమ్మ దేవాలయం వద్ద కూడా అన్నదానం నిర్వహించారు.

అంతకుముందు తాండూరు పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రి, ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఉదయం అల్పహారం, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పటేల్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జన్మదినం సందర్భంగా పూజలు, సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో దేవాలయంలో దాసోహ మందిరం నిర్మించుకోవడం జరిగిందన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తనదైన పాత్ర పోషిస్తున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆరోగ్యంగా ఉండాలని, మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో దేవాలయ కమిటి సభ్యులు, వీరశైవ, వీరశైవ యుదళ్ సభ్యులు, భక్తులు, ఎమ్మెల్యే అభిమానులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి..

