చిలుక వాగు డ్రైన్ రూట్ చేంజ్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

చిలుక వాగు డ్రైన్ రూట్ చేంజ్..!
– ప్లాట్లు, పొలాల మద్య రోడ్డు కుదించి పనులు
– విషయం తెలిసి అభ్యంతరం తెలిపిన ప్రజలు
– సముదాయించిన మున్సిపల్ కమీషనర్
– పట్టణ పోలీసుల సమక్షంలో చర్చలు
– ప్రత్యేకంగా పరిశీలించిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిలుక వాగు డ్రైన్ రూట్ చేంజ్ చేశారు. ఫ్లాట్లు, రైతుల పొలాల మద్య ఉన్న రోడ్లను కుదించి పనులు చేపట్టడం పట్ల రైతులు, పలువురు ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ శుక్రవారం సాయిపూర్ ప్రాంత శివారు నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే మార్గంలో పనులు చేపట్టారు. స్థానికులు, రైతులు పనులను ఆపాలని అభ్యంతరం వ్యక్తం చేయవడంతో వివాదాస్పదంగా మారింది.
kvcs
హైదరాబాద్ రోడ్డు మార్గం నుంచి సాయిపూర్ మీదుగా చిలుక వాగు డ్రైన్ పనులు చేపడుతున్న సంగతి తెలిసిందే. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో రూ. 16 కోట్లతో పనులు చేపడుతున్నారు. అయితే చిలుక వాగు కాలువ మ్యాపులో ఉన్నట్లు ముందు ప్రవహించే మార్గంలో కాకుండా రూట్ మార్చి పనులు చేపడుతున్నారని సాయిపూర్ ప్రాంత రైతులు, స్థానిక ప్లాట్ల యజమానులు వాపోయారు. శుక్రవారం ఉదయం పనులను అపాలని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సంహారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

మరోవైపు తాండూరు పట్టణ పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో పరిస్థితి ఉత్కంఠంగా మారింది. మున్సిపల్ కమీషనర్ రైతులు, యజమానులతో మాట్లాడారు. రూటు మార్చి నిర్మిస్తున్న రోడ్డు 13 ఫీట్లే ఉందని, ఇప్పుడు డ్రైన్ కోసం సుమారు 10 ఫీట్లకు పైగా డ్రైన్ నిర్మించే రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతాయని రైతులు. యజమానులు కమీషనర్ కు వివరించారు. రైతులకు, యజమానులకు ఇబ్బందులు రాకుండా డ్రెస్ నిర్మాణం చేపడుతామని చెప్పారు. పనులను అడ్డుకునే ప్లాట్లతో పాటు సాయిపూర్ ప్రాంతం నీటిలో మునిగిపోయే ప్రమాదం ఏర్పడుతుందని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రైతులకు, యజమానులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని, పనులను ఆపవద్దని సముదాయించారు. దీంతో రైతులు, యజమానులు వెనక్కితగ్గారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ ఖాజా, పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు.

ఇబ్బందులు లేకుండా పనులు పూర్తి చేయిస్తాం : బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
మరోవైపు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి చిలుక వాగు డ్రైన్ నిర్మాణ పనులను ప్రత్యేకంగా పరిశీలించారు. సాయిపూర్ ప్రాంతం నుంచి హైదరాబాద్ రోడ్డు మార్గం వరకు చేపట్టే డ్రైన్ నిర్మాణ పనులను కాంట్రాక్టర్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సాయిపూర్ ప్రాంతానికి చెందిన రైతులు. ప్లాట్ల యజమానులతో మాట్లాడారు. వారికి కలుగుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. రైతులకు. యజమానులకు, ఎవ్వరికి ఇబ్బందులు కలగకుండా పనులు పూర్తి చేసేలా చూస్తామన్నారు. పనులు వేగవంతం చేసి వరధ ముంపు జరగకుండా కృషి చేస్తామన్నారు. ఆయన వెంట యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్, వికాష్ జోషి. విష్ణు తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

బంటు మల్లప్ప ఇంటికి చీఫ్ విప్…!