బంటు మల్లప్ప ఇంటికి చీఫ్ విప్…!

తాండూరు రాజకీయం వికారాబాద్

బంటు మల్లప్ప ఇంటికి చీఫ్ విప్…!
– శుభకాంక్షలు తెలిపిన మహేందర్ రెడ్డి
– ఇంట్లో భోజనం చేసిన ఎస్ఎఫ్సీ మెంబర్ రమేష్ మహారాజ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూరకు చెందిన కాంగ్రెస్ సీనీయర్ నాయకుడు బంటు మల్లప్ప ముదిరాజ్ ఇంటికి తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమీషన్(ఎస్ఎఫ్సీ) మెంబర్ ఎం. రమేష్ మహారాజ్ లు వేరు వేరుగా వెళ్లారు.
kvcs
గురువారం సాయిపూర్ లో బంటు మల్లప్ప నూతన గృహా ప్రవేశ వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడులకు హాజరు కాలేకపోయినందుకు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ మహేందర్ రెడ్డి బంటు మల్లప్ప నివాసానికి వెళ్లారు. బంటు మల్లప్పను, కుటుంబ సభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. చీఫ్ విప్ వెంట టీపీసీసీ ప్రచార కార్యదర్శి కరణం పురుషోత్తంరావు ఉన్నారు.

అంతకుముందు తెలంగాణ రాష్ట్ర ఫైనాఫ్స్ కమీషన్ మెంబర్ ఎం. రమేష్ మహారాజ్ కూడా బంటు మల్లప్ప ఇంటికి వెళ్లారు. నూతన గృహ ప్రవేశం సందర్భంగా రమేష్ మహారాజ్ బంటు మల్లప్పకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బంటు మల్లప్పతో కలిసి భోజనం చేశారు. ఆయన వెంట బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణు గోపాల్ తదితరులు ఉన్నారు. తమ ఇంటికి వచ్చిన చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, కరణం పురుషోత్తంరావులతో పాటు స్టేషన్ ఫైనాన్స్ కమీషన్ మెంబర్ ఎం. రమేష్ మహరాజ్ లను బంటు మల్లప్ప శాలువాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదికూడా చదవండి…

వృద్ధులకు ఆర్టీసీ అదిరే ఆఫర్…!