మార్వాడి యువమంచ్ మంచి మనసు

తాండూరు రాజకీయం వికారాబాద్

మార్వాడి యువమంచ్ మంచి మనసు
– మంచానికి పరిమితమైన వ్యక్తికి వీల్ చైర్ అందజేత
– ధన్యవాదాలు తెలిపిన బాధితుడు
తాండూరు, దర్శిని ప్రతినిధి : మానవ సేవల్లో మార్వాడి యువమంచ్ మరోసారి మంచి మనసును చాటుకుంది. మంచానికి పరిమితమైన ఓ వ్యక్తికి వీల్ చైర్ అందించి చేయూతను అందించింది.
kvcs
వివరాలల్లోకి వెళితే.. తాండూరు పట్టణం సాయిపూర్ ప్రాంతానికి చెందిన కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగి గత జనవరిలో బ్రేయిన్ అపరేషన్ అయి, పక్షవాతంతో మంచానికే పరిమితం అయ్యాడు. పత్రికల్లో ఈ విషయం తెలుసుకున్న మార్వాడి యువమంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్ సార్థా స్పందించారు.

మంచ్ సభ్యులు అయిన మహేష్ పర్తాని, దినేష్ పర్తానిల ఆర్థిక సాయంతో బాధితుడికి కమోడో వీల్ చైర్ ను అందజేశారు. మార్వాడి యువమంచ్ చేసిన సాయానికి బాధితుడు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచ్ అధ్యక్షులు అనిల్ సార్డా, కార్యదర్శి సచిన్ రాఠీ, కోశాధికారి అరుణ్ సార్థా, మాజీ అధ్యక్షులు సూర్యప్రకాష్ సోమాని, దీనేష్ పర్తాని తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

రెడ్ అలెర్ట్ పై ఫుల్ అలెర్ట్..!