శ్రీ సాయి మేధ విద్యాలయంలో కొలువుదీరిన గణపయ్య..!

తాండూరు రాజకీయం వికారాబాద్

శ్రీ సాయి మేధ విద్యాలయంలో కొలువుదీరిన గణపయ్య..!
– ప్రత్యేక పూజలు చేసిన కరెస్పాండంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి
– పాల్గొన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం శివాజీ చౌక్ లోని శ్రీ సాయి మేధ విద్యాలయంలో వినాయకచవితి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో సంప్రదాయ బద్దంగా నిర్వహించారు. మహాగణపతిని ప్రతిష్టించి పాఠశాల కరెస్పాండంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.

విఘ్నాలు లేకుండా విద్యార్థులు చక్కగా చదువుకునేందుకు దైవ ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి కరుణకటాక్షాలతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో గడపాలని కోరుకున్నారు. ప్రతి ఏటా పాఠశాలలో గణపతి పండుగ జరుపుకుంటున్నట్లు తెలిపారు. పాఠశాల స్థాయినుంచే విద్యార్థులకు మాతృభక్తి, దైవభక్తి, దేశభక్తి పెంపొందించుటకు స్కూల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలిపారు. అందుకు సహకరిస్తున్న ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. వినాయక చవితి ఉత్సవాలతో పాఠశాలలో సందడి నెలకొంది.

ఇదికూడా చదవండి…

ఎంసీహెచ్‌ ఆసుపత్రిపై ఎమ్మెల్యే ఫోకస్..!