శంకరన్న జన్మదినం.. సేవా సంబరం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

శంకరన్న జన్మదినం.. సేవా సంబరం..!
– తాండూరులో అట్టహాసంగా వేడుకలు
– జిల్లా ఆస్పత్రి, ఎంసీహెచ్‌లో పండ్లు, అల్పహారం పంపిణీ
– పాల్గొన్న కుటుంభీకులు, బంటు మల్లప్ప
తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదలు, భక్తుల అన్నదాత, తాండూరుకు చెందిన ప్రముఖ రియల్ ఏస్టేట్ వ్యాపారి బావనోళ్ల శంకర్‌ యాదవ్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి.
kvcs
శుక్రవారం శంకర్‌ యాదవ్ ఆధ్వర్యంలో ఆయన తండ్రి బావనోళ్ల హన్మయ్య, కుమారుడు అభినవ్ సాయిలు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి, హైదరాబాద్‌ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుపత్రిలో రోగులకు, బంధువులకు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. హన్మయ్య, అభినవ్‌ సాయిలతో పాటు బంటు మల్లప్పలు ఆయా ఆసుపత్రిలోని రోగుల వార్డులకు వెళ్లి ప్రతి ఒక్కరికి పండ్లు పంపిణీ చేశారు.

అనంతరం ఆయా ఆసుపత్రిల ఆవరణలో రోగులు, బందవులుకు అల్పహారం పంపిణీ చేశారు. మరోవైపు సాయిపూర్‌, శంకర్‌ యాదవ్ స్వగ్రామం చెంగోల్‌లో అన్నదాన కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల అన్నదాత, రియల్ ఏస్టేట్ వ్యాపారి బావనోళ్ల శంకర్ యాదవ్ నిండు నూరేళ్లే సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శంకరన్న అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

వెరైటీ వినాయకులను చూశారా..!