కేసీఆర్‌ను దీవించాలి
– తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– ఆసరా లబ్దిదారులకు ఫించన్ కార్డుల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆసరా ఫించన్ అందిస్తూ అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్ ను మనస్పూర్తిగా దీవించాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ పరిధిలోని 19వ వార్డు నుంచి 35వ వార్డులకు చెందిన ఆసరా ఫించన్ లబ్దిదారులకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రభుత్వం మంజూరు చేసిన ఫించన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వృద్ధుల ఆత్మగౌరవం పెంచడంతో పాటు వికలాంగులకు, ఒంటరి మహిళలకు, బోధకాలు, డయాలిసిస్ రోగులకు అండగా నిలిచేందుకు సీఎం కేసీఆర్ ఆసరా ఫించన్ పథకాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. దీంతో సీఎం కేసీఆర్ కు శ్రీరామరక్షగా నిలుస్తూ ఎల్లప్పుడూ దీవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పబ్లోళ్ల దీపా నర్సింలు. ఏఎంసీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఆప్పూ (నయూం), నాయకులు నర్సింలు, శ్రీనివాస్ దారి. నర్సిరెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.


