సమాజ నిర్మాతలు గురువులు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

సమాజ నిర్మాతలు గురువులు..!
– తాండూరు ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం
– గుర్తించి.. సన్మానించిన టీపీఎస్ అసోసియేషన్
తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులే అని తాండూరు ప్రైవేట్ స్కూల్స్(టీపీఎస్) అసోసియేషన్ నేతలు అన్నారు. శుక్రవారం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

ఇందులో భాగంగా అసోసియేషన్ తరుపున 2025విద్యాసంవత్సరంలో విద్యారంగ అభివృద్ధికి విశిష్ట కృషి చేస్తున్న ఉపాధ్యాయులను ప్రతి పాఠశాల నుంచి ఇద్దరు చొప్పున గుర్తించి.. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రధానం చేశారు. సుమారు 38 పాఠశాలలు, 76 మంది ఉపాధ్యాయులను సన్మానించి ఉత్తమ అవార్డులను అందజేశారు.
kvcs
ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ నవ సమాజ నిర్మాణానికి ఉపాధ్యాయులే నిర్మాతలుగా నిలుస్తున్నారని అన్నారు. గురువు వెలుగు అయితే శిష్యుడు దీపం అవుతాడని, గురువు మార్గం అయితే.. శిష్యుడు విజయం అవుతాడని.. అదే మార్గంలో సమ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు. ఉపాధ్యాయుల అంకిత భావాన్ని గుర్తించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగానే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను సన్మానించడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవాధ్యక్షులు కిరణ్ కుమార్, అధ్యక్షులు రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు పి.మహిపాల్ రెడ్డి, కార్యదర్శి మోహన్ కృష్న గౌడ్, సంయుక్త కార్యదర్శి శివకుమార్, కోశాధికారి సతీష్, సభ్యులు, పలు పాఠశాలల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

బీసీల అభ్యున్నతి మార్గదర్శకులు మాణిక్ రావు