కొంపముంచిన నిద్రమత్తు..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

కొంపముంచిన నిద్రమత్తు..!
– డ్రైనేజీలోకి దూసుకెళ్లిన కారు
– తాండూరు ఇందిరా చౌరస్తా వద్ద ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : నిద్రమత్తులో చేస్తున్న కారు డ్రైవింగ్ కొంపముంచింది. అదుపు తప్పిన కారు ఏకంగా నిర్మాణంలో ఉన్న డ్రైనేజీలోకి దూసుకెళ్లింది.
kvcs
ఈ సంఘటన తాండూరు పట్టణం ఇందిరా చౌరస్తా వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారు జామున కోడంగల్ రోడ్డు నుంచి ఇందిరా చౌరస్తా వైపు కారు అదుపు తప్పి ఓ వైన్‌ షాపు ముందు నిర్మిస్తున్న డ్రైనేజీలోకి దూసుకెళ్లింది. కారులో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.

గమనించిన స్థానికులు డ్రైవర్‌ ను బయటకు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సాయంతో కారును బయటకు తీశారు. ఈ ప్రమాదం నుంచి బయట పడిన వారి వివరాలు తెలియరాలేదు. తాండూరు పట్టణానికి చెందిన వ్యక్తులే అని చెబుతున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇదికూడా చదవండి….

రాముని గుడికి తల్లి పేరుపై విరాళం