బీఆర్‌ఎస్‌దే ఉత్తుత్తి ప్రోసిడింగ్‌ల డ్రామా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బీఆర్‌ఎస్‌దే ఉత్తుత్తి ప్రోసిడింగ్‌ల డ్రామా..!
– ఆర్థిక ఆమోదం లేకుండా పైలెట్ హడావుడి
– గత ప్రభుత్వ పనుల పూర్తికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషి
– మింగుడు పడని బీఆర్ఎస్ నేతల విమర్శలు విడ్డూరం
– డీసీసీబీ ఉమ్మడి జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఉత్తుత్తి ప్రొసిడింగ్లు తీసుకవచ్చి అభివృద్ధి మాయ చేసేందుకు కుట్ర చేసిన ఘనత గత బీఆర్ఎస్ నేతలకే దక్కిందని డీసీసీబీ ఉమ్మడి జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్ విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకవచ్చిన అభివృద్ధి పనులనే కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేస్తున్నారని బీఆర్ఎస్ తాండూరు మండల పార్టీ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి చేసిన ఆరోపణలను గురువారం డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్ ఖండించారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న పైలెట్ రోహిత్ రెడ్డి ప్రజలను మభ్య పెట్టేందుకు ఉత్తుత్తి ప్రొసిడింగ్ లను అందించారని ఆరోపించారు.

ఆర్థిక ఆమోదం లేకుండానే జీఓ కాపీలతో హడావుడి చేశారని విమర్శించారు. ఉత్తర్వులు అందుకున్న కాంట్రాక్టర్లు అధికారుల వద్దకు వెళ్లి ఆరా తీయడంలో నిధులు రాలేదని గుర్తించారని, అందుకే పనులు చేపట్టకుండా మిన్నకుండి పోయారని అన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా గెలిచిన బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తీసుకవచ్చిన ఉత్తుత్తి ప్రొసిడింగ్ లను కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకవెళ్లి పనులు పూర్తిచేయించేలా ప్రత్యేక కృషి చేస్తున్నారని అన్నారు. కాంట్రాక్టర్లు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రావద్దని ఉద్దె శంతో పనులు చేపడుతున్నారని అన్నారు. ఈ చొరవతోనే బెల్కటూర్ బ్రిడ్జి పనులు, సిరిగిరిపేట్ రోడ్డు పనులు చకచకా జరగుతున్నాయన్నారు.

అదేవిధంగా తాండూరు అభివృద్ధి కోసం రూ.800 కోట్ల తీసుకవచ్చిన ఘనత ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికే దక్కిందన్నారు. గతంలోనే ప్రొసిడింగ్లు తీసుకవచ్చిన రోహిత్ రెడ్డి పనులను ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ ను అడ్డం పెట్టుకోవడం తప్పుడు ప్రచారానికే ఊతమిస్తుందని అన్నారు. తాండూరులో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిపై బీఆర్ఎస్ నేతలకు మింగుడు పడడం లేదని విమర్శించారు. అభివృద్ధిని అభినందించాల్సి పోయి విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. తాండూరును అన్ని విధాల అభివృద్ధి చేయాలనే తపనతోనే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముందుకు సాగుతున్నారని అన్నారు. పార్టీలకతీతంగా.. అవినీతికి అస్కారం లేకుండా కృషి చేస్తున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

ఇదికూడా చదవండి…

బ్రహ్మోత్సవాలలో ‘బావనోళ్ల’ భక్తజన సేవ..!