చికిత్స పొందుతూ కన్నుమూశాడు..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

చికిత్స పొందుతూ కన్నుమూశాడు..!
– రైల్వే ప్రమాదంలో గాయపడిన ఏఎస్ఐ మృతి
తాండూరు, దర్శిని ప్రతినిధి : కదులుతున్న రైలు ఎక్కబోయి ప్రమాదానికి గురైన రైల్వే ఏఎస్ఐ చికిత్స పొందుతూ ప్రాణం విడిచాడు. మంగళవారం రాత్రి తాండూరు రైల్వే స్టేషన్లో రైలు ఎక్కబోయి ఏఎస్ఐ మారుతి(49) ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.

కర్ణాటక రాష్ట్రం చించొల్లి తాలూకా మర్పల్లికి చెందిన మారుతి కల్బుర్గి జిల్లా జేడిహల్లి పోలీస్టేషన్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి తాండూరు నుంచి బెంగులూరు వెళ్లేందుకు వచ్చారు. అప్పటికే యశ్వంత్ పూర్ రైలు ముందుకు కదలడంతో మారుతి రైలు ఎక్కేందుకు పరిగెత్తారు. రైలు కదులుతుండడంతో ఆయన అదుపుతప్పి పడిపోయారు.
kvcs
ఈక్రమంలో ఆయన రెండు కాళ్లకు గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ఆయనను చికిత్స నిమిత్తం తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంభీకులు ఆయనను మెరుగైన వైద్యం కోసం కల్బుర్గి జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మారుతి మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు.

ఇదికూడా చదవండి….

కదులుతున్న రైలు ఎక్కబోయి…!