వైభవంగా గీతా, విష్ణు సహస్రనామా పారాయణం
యాలాల, దర్శినితి ప్రతినిధి: యాలాల మండలం ముద్దాయిపేట్‌లో గీతా పారాయణం, విష్ణు సహస్ర నామా పారాయణ ఉత్సవాలు వైభవంగా జరిగాయి.
సోమవారం గ్రామానికి చెందిన ఎంపీటీసీ దేవగారి రాములు నివాసంలో ఈ ఉత్సవాలను ఏర్పాటు చేశారు. కార్తీక మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ మహా విష్ణు చిత్రపటానికి పూజలు నిర్వహించి గీతా పారాయణ, విష్ణు సహస్రనామా పారాయణాన్ని పటించారు. అనంతరం పలు భజన కీర్తనలతో భగవన్‌నామ స్మరణను మార్మోగించారు. ఈ కార్యక్రమంలో తాండూరు గీతా తత్సంగ్ సమితి సభ్యులతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.


