కోస్గి ఎంపీడీఓగా కుర్వ క్రాంతి..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

కోస్గి ఎంపీడీఓగా కుర్వ క్రాంతి..!
– తాండూరు యువకుడికి పోస్టింగ్
– మంత్రి సీతక్క చేతుల మీదుగా సర్టిపికెట్
తాండూరు, దర్శిని ప్రతినిధి : గ్రూప్ – 1లో ఉద్యోగం సాధించిన తాండూరు యువకుడు కుర్వ క్రాంతి ఎంపీడీఓగా పోస్టింగ్ ఖరారయ్యింది. నారాయణపేట జిల్లా కోస్గి మండల అభివృద్ధి అధికారిగా నియామకం అయ్యారు.

తాండూరు ప్రాంతానికి చెందిన ప్రముఖ న్యాయవాది కె.గోపాల్, ఉపాధ్యాయురాలు బాలమణిల కుమారుడు కుర్వ క్రాంతి గ్రూప్-1 సత్తాచాటి ఎంపీడీఓగా ఉద్యోగం సాధించిన సంగతి తెలిసిందే. గత 15 రోజుల నుంచి రాజేంద్రనగర్ లోని తెలంగాణ ఇన్సిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, శాఖ డైరెక్టర్ సృజనల ద్వారా కుర్వ క్రాంతి సర్టిఫికెట్ ను పొందారు.
kvcs
శిక్షణ పూర్తి చేసుకున్న కుర్వ క్రాంతికు నారాయణపేట జిల్లా కోస్గి మండల అభివృద్ధి అధికారిగా నియమించారు. సోమవారం మొదటి సారి కుర్వ క్రాంతి ఎం పీడీఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు కె.గోపాల్, బాలమణిలు సంతోషం వ్యక్తం చేశారు. కష్టాలను దాటి.. సామాన్య కుటుంబం నుంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా పలువురు కుర్వ క్రాంతికు అభినందనలు తెలిపారు. ఎంపీడీఓగా సామాన్యుల కష్టాలు అర్థం చేసుకుని వాటిని పరిష్కరిస్తూ.. మంచి పేరుతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

ఇదికూడా చదవండి…

భక్తుల కోసం.. భక్తులు..!