ఉప్పొంగిన దేశభక్తి..!
– అట్టహాసంగా వందేమాతరం గీతాలాపన
– స్ఫూర్తిని చాటిన మున్సిపల్ ఉద్యోగులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పౌరుల్లో దాగి ఉన్న దేశభక్తిని వందేమాతర గీతం తట్టిలేపింది. వందేమాతర గీతం శుక్రవారంతో 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తాండూరులో గీతాలాపన కార్యక్రమాలను నిర్వహించారు.

తాండూరు మున్సిపల్ కార్యాలయంలో కమీషనర్ యాదగిరి ఆధ్వర్యంలో ఉద్యోగులు, సిబ్బంది సామూహికంగా వందేమాతరం గీతాన్ని ఆలాపించారు. దీంతో ఉద్యోగులు వందేమాతర గీతంపై స్పూర్తిని, భక్తిని చాటుకున్నారు. అనంతరం కమీషనర్ యాదగిరి మాట్లాడుతూ దేశ స్వాంతంత్రంలో వందేమాతర గీతం అందరిలో స్ఫూర్తిని నింపిందని అన్నారు.

ఈ గీతం ప్రతి పౌరుడిలో దేశభక్తి భావాన్ని పెంపొందిస్తుందని అన్నారు. దేశ ఐక్యతకు, ఎ భ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరు వందేమాతర గీతంపై స్పూర్తిని నిలుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ నరేందర్ రెడ్డి, ఏఈలు ఖాజా హుస్సేన్, ఉదయ్ కుమార్, టీపీపీఓలు వంశి, నరేష్, ప్రియ, టీఎంసీ రాజేంద్రప్రసాద్, కోఆర్టీనేటర్ విశాల, ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

