గౌతాపూర్‌లో నవరాత్రి, బతుకమ్మ ఉత్సవాలు

తాండూరు రాజకీయం వికారాబాద్

గౌతాపూర్‌లో నవరాత్రి, బతుకమ్మ ఉత్సవాలు
– అమ్మవారిని దర్శించుకున్న కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం గౌతాపూర్ గ్రామంలో శరన్నవరాత్రులు, బతుకమ్మ ఉత్సవాలు వైభవంగా జరుపుకున్నారు. శుక్రవారం గ్రామంలో దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐని గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. అనంతరం మహిళలు అమ్మవారి వద్ద శరన్నవరాత్రులతో పాటు బతుకమ్మ ఉత్సవాలను సంబంరంగా జరుపుకున్నారు. అనంతరం పలువురు. మాట్లాడుతూ శరన్నవరాత్రులు, బతుకమ్మ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగప్ప, రాజప్ప గౌడ్, నరేందర్ రెడ్డి, రాంచెంద్రారెడ్డి, శకుంతల, బసంత్ రెడ్డి, సునీల్, మహేష్, నర్సింహారెడ్డి, బాలప్ప, మహేష్ గౌడ్, బాలయ్య గౌడ్, వెంకటేష్, నరేందర్, శ్రీశైలం, సాయిపూర్, వెంకట్ ప్రసాద్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

ఓటమి గుణపాఠం సరిపోదా..!