హైవేపై తికమక.. ఉండదిక..!

జాతీయం టెక్నాలజీ తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

హైవేపై తికమక.. ఉండదిక..!
– సాఫీ ప్రయాణం కోసం క్యూఆర్ కోడ్‌లు
– స్కాన్‌ చేస్తే అవసరమైన సేవల వివరాలు
– ఎలాంటి సేవలు అందుబాటులో ఉంటాయో తెలుసా
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : జాతీయ రహదారుల(నేషనల్‌ హైవే)పై ప్రయాణించే వారు ప్రమాదాలకు గురైనా.. లేదా ఎలాంటి సమాచారం తెలుసుకోవాలన్నా ఇబ్బందులు పడుతుంటారు. మఖ్యంగా అర్దరాత్రి సమయాల్లో అయితే ఆందోళనకు గురయ్యే పరిస్థితులు ఉంటాయి. కొన్ని రోజుల్లోనే ఈ సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలోని జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేయబోతోంది.

ఈ రహదారులపై ప్రయాణం సాఫీగా సాగేందుకు, ప్రయాణికులకు అవసరమైన సేవలు అందించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. దీనిలో భాగంగా క్యూఆర్​ (క్విక్​ రియాక్షన్​) కోడ్​లను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఆ కోడ్​లతో కూడిన బోర్డులు ఈ నెలలోపు ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో రహదారులపై అత్యవసర సేవల సమాచారం తెలిపేందుకు ప్రభుత్వం క్యూఆర్​ కోడ్​లు ఏర్పాటు చేస్తోంది. వీటిని ప్రతి 10 కిలో మీటర్లకు ఒక చోట అమరుస్తున్నారు. ఎంపిక చేసిన ప్రదేశాల్లో వాహన చోదకులకు సులువుగా అర్థమయ్యేలా మూడు భాషల్లో ఉంటాయి. ఇలా క్యూఆర్​ కోడ్​ను స్కాన్​ చేయగానే పూర్తి సమాచారం ఫోన్​ స్క్రీన్​పై కనిపిస్తుంది. మనకు అవసరమైన అంశంపై క్లిక్​ చేస్తే సదరు సమాచారం తెలిసిపోతుంది.

తికమక లేకుండా ప్రయాణం
కొన్నిసార్లు పెట్రోల్​ అయిపోయినా ఇబ్బంది పడాల్సిందే. ఇలా ప్రయాణంలో మనకు కావాల్సిన సమాచారం తెలుసుకోలేక అవస్థలు పడుతుంటారు. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు రహదారులపై క్యూఆర్​ కోడ్ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. మెదక్​, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్​ జిల్లాల మీదుగా 6 జాతీయ రహదారులు వెళుతున్నాయి. ఈ జాతీయ రహదారిపై వెళ్లే సమయంలో అత్యవసరమైన సమస్య వస్తే ఎవరిని సంప్రదించాలో తెలియక తికమకపడుతుంటారు. ఈ క్యూఆర్​ కోడ్ బోర్డులు టోల్ ​ప్లాజాలు, ట్రక్​ లే బై ప్రాంతాలు, నగరాల ఎంట్రీ రోడ్లు, ప్రధాన పట్టణాలు, హైవే ప్రారంభం, స్లిప్​ రోడ్లు, ప్రధాన కూడళ్లు, ముగింపు ప్రాంతాలు, పెట్రోల్​ బంక్​లు, సర్వీస్​ కేంద్రాల వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు.

స్కాన్‌ చేస్తే..
ఎన్‌హెచ్‌ నిర్మాణం, నిర్వహణ కాలం, అత్యవసర హెల్ప్‌లైన్‌ నంబరు 1033
రహదారి సంఖ్యతో పాటు ప్రాజెక్టు వైశాల్యం, పోడువు తెలుసుకోవచ్చు.
రహదారిపై పెట్రోలింగ్​, టోల్​, ప్రాజెక్ట్​ మేనేజర్​, ఇతర అధికారుల నంబర్లు.
అలాగే సమీపంలోని ఉన్న ఆసుపత్రులు, పెట్రోల్​ బంకులు, వాష్​రూమ్స్​, రెస్టారెంట్లు, పోలీస్​స్టేషన్లు.
వాహన సర్వీస్​ స్టేషన్లు, ఈ-ఛార్జింగ్​ స్టేషన్ల వివరాలు, పంక్చర్​ షాపులు.
ఇంకా రహదారి పక్కన ఉండే రెస్ట్​ ఏరియాలు కూడా తెలుసుకోవచ్చు.

ఇదికూడా చదవండి…

యాదవ బిడ్డకు ఎమ్మెల్యే అవకాశం అభినందనీయం