హస్తంలో సంబరాలు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

హస్తంలో సంబరాలు..!
– కొత్త సర్పంచులకు శుభాకాంక్షలు
– సన్మానించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అంబరాంటేలా సంబరాలు జరుపుకున్నారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు దారులు గెలుపొందడంతో సంబరాలు చేసుకున్నారు.

శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కొత్త సర్పంచులు, ఉప సర్పంచుల కలిశారు. ఎమ్మెల్యే సమక్షంలో నేతలు, కార్యకర్తలు జోషుల్గా గడిపారు. ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, ఉపసర్పంచులను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సన్మానించారు. శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. సన్మానాలు, శుభాకాంక్షలతో క్యాంపు కార్యాలయం పండగ వాతావరణంతో నిండిపోయింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 100 స్థానాలు గెలుపొందడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మెజార్టీ స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిందన్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, ఆయా గ్రామాల నాయకులు, పెద్దలు, వార్డు సభ్యులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

అంబులెన్స్‌లో గర్భిణీ ప్రసవం