పంచాయతీలో పట్టభద్రుడి విజయం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పంచాయతీలో పట్టభద్రుడి విజయం..!
– కాంగ్రెస్ మద్దతు అభ్యర్థిగా భారీ మెజార్టీ
– నాగసముందర్‌ సర్పంచుగా కొలి వెంకటేశ్వర్
ధారూర్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలో రెండో విడతలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పట్టభద్రుడు సర్పంచుగా ఎన్నికయ్యాడు. ధారూర్ మండలం నాగసుమందర్ పంచాయతీ సర్పంచుగా కొలి వేంకటేశ్వర్ భారీ మెజార్టీతో ఎన్నికయ్యారు. ఎంఎ, బీఈడి చదువుకున్న కొలి వెంకటేశ్వర్ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రావడంతో పోటీకి సిద్దమయ్యారు.

కాంగ్రేస్ మద్దతు అభ్యర్థిగా పంచాయతీ సర్పంచు స్థానానికి నామినేషన్ వేశారు. తనకు కేటాయించిన ఉంగరం గుర్తుతో ప్రచారంలో తనదైన శైలిని ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ఆదివారం జరిగిన ఎన్నికలు, కౌంటింగ్‌లో ప్రత్యర్థులపై భారీ మెజార్టీతో గెలిచారు. సుమారు 575 ఓట్ల మెజార్టీతో సర్పంచ్ పదవిని కైవసం చేసుకున్నారు. కొలి వెంకటేశ్వర్ సాధించిన విజయానికి గ్రామస్తులు, బందువులు, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.

ఇదికూడా చదవండి…

విజయవంతంగా పూర్తిచేసిన శబరిమల పాదయాత్ర…!