ఎన్ఎస్యూఐ తాండూరు ప్రెసిడెంట్‌గా వికాస్ జోషి
– నియామకం చేసిన రాష్ట్ర అధ్యక్షులు బాల్మూరీ వెంకట్
తాండూరు, దర్శిని ప్రతినిధి: నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్యూఐ) తాండూరు అసెంబ్లీ ప్రెసిండెంట్‌గా వికాస్ జోషి నియామకం అయ్యారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షులు బాల్మూరి వెంకట్ నియామక పత్రం జారీ చేశారు. ఈ సందర్భంగా వికాష్ జోషి మాట్లాడుతూ తాండూరులో విద్యారంగ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి ఎన్ఎస్యూఐ తాండూరు అసెంబ్లీ ప్రెసిడెంట్ గా నియమించడం పట్ల రాష్ట్ర అధ్యక్షులు బాల్మూరీ వెంకట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సహకరించిన టీపీసీసీ ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ తాండూరు నియోజక వర్గం ఇంచార్జ్ ఎం. రమేష్ మహారాజ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారా సింగ్, ఉత్తమ్ చంద్, జనార్ధన్ రెడ్డి, నర్సి రెడ్డిలలతో పాటు జిల్లా సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఇది కూడా చదవండి…

