పాస్టర్ల కుటుంబాలకు క్రిస్మస్ కానుక
– మెథడిస్ట్ సెంట్రల్ చెర్చిలో దుస్తుల పంపిణీ
– హాజరైన డీఎస్ కోట్రిక జనార్థన్
– లే లీడర్, సంఘ పెద్దల ఆధ్వర్యంలో కార్యక్రమం
తాండూరు, దర్శిని ప్రతినిధి : నిత్యం ఏసు నామంను పలికే పాస్టర్లకు పండగ కానుక అందింది. తాండూరు పట్టణంలోని మెథడిస్ట్ సెంట్రల్ చెర్చి ఇందుకు వేదిక అయ్యింది. లే లీడర్ ఏసుదాసు, సంఘ పెద్దలు టీ పాల్‌ల ఆధ్వర్యంలో పాస్టర్లకు దుస్తుల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.

మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డీఎస్ కోట్రిక జనార్థన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఈనెల 25న జరిగే ఏసు జన్మదినం, క్రిస్మస్ పండగను పురస్కరించుకుని మెథడిస్ట్ సెంట్రల్ చర్చిలో ప్రత్యేక ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. ఏసు నామంతో పాటలు, ప్రార్థనలు ఆకర్షణగా నిలిచాయి. అనంతరం డీఎస్ జనార్దన్ సమక్షంలో పట్టణంలోని మెథడిస్ట్ సెంట్రల్ చర్చితో పాటు గ్రామాల పరిధిలో సేవలందిస్తున్న పాస్టర్ల కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలను కానుకలుగా అందజేశారు.

ఈ సందర్భంగా డిఎస్ మాట్లాడుతూ ఈనెల 25న జరగనున్న క్రిస్టమస్ పండుగను ప్రశాంతవంతమైన వాతావరణంలో శాంతియుతంగా ఏసుక్రీస్తు ప్రభువు వారి జన్మదిన వేడుకలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. పాస్టర్ల కుటుంబ సభ్యులకు క్రిస్టమస్ కానుకలను అందజేసిన లే లీడర్ ఏసుదాసు, సంఘ పెద్దలు టి పాల్ ను అభినందించారు. అనంతరం తాండూరు మెథడిస్ట్ సెంట్రల్ చర్చి లే లీడర్ ఏసుదాస్ మాట్లాడుతూ దైవ సేవకులకు తన వంతుగా క్రిస్టమస్ కానుకలను అందజేయడం సంతోషంగా ఉందన్నారు. సంఘ పెద్దలు టి పాల్ మాట్లాడుతూ క్రిస్మస్ సందర్భంగా దైవ సేవకుల కుటుంబ సభ్యులకు బ్లాంకెట్స్ ను కానుకలు అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ధైవ సేవకులు రెవ అబ్రహం, రెవ, పి భాస్కర్, రెవ సమృద్ధి, ప్రతాప్ సింగ్, అశోక్ రాజ్, సీనియర్ జర్నలిస్ట్ సైమన్, వివిధ సంఘాలకు చెందిన పాస్టర్లు, విశ్రాంత ఉద్యోగులు, సంఘ పెద్దలు, మహిళలు, యవనస్తులు, పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

