భూకైలాస్‌లో ఘనంగా శనీశ్వర పూజలు
– దోష నివారణ పూజలు చేసిన భక్తులు
– శనీత్రయోదశితో దర్శనం
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం అంతాంరం తాండాలో వెలసిన శ్రీ భూకైలాస్ ద్వాదశ జ్యోతిర్లింగాల దేవాలయంలో శనీశ్వర పూజలు ఘనంగా నిర్వహించారు. శనివారం శనీత్రయోదశి సందర్భంగా ఆలయ పండితులు రవిశంకర్ స్వామి, బిచ్చయ్య, జగదీష్, ఆనంద్ స్వామి సమక్షంలో ఆలయంలో వెలసిన శనీశ్వర స్వామిని అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా శనీఅనుగ్రహం కోసం, దోషం ఉన్న వివిధ రాశుల భక్తులు శనీశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ పండితులు సూచించిన వక్కలు, ఖర్జూర పండ్లు, నువ్వుల నూనే, నల్ల ద్రాక్ష, నల్లదారం, నల్ల జిల్లేడు పూలు/ఆకులు, టెంకాయలు తదితర వస్తువులతో శనీశ్వర స్వామికి పూజలు నిర్వహించారు. దీంతో ఆలయంలో భక్తుల సందర్శన సందడిగా మారింది.
ఇదికూడా చదవండి…

