భద్రేశ్వర దేవాలయ అభివృద్ధే ధ్యేయం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

భద్రేశ్వర దేవాలయ అభివృద్ధే ధ్యేయం..!
– త్వరలో దుకాణాల సముదాయం ప్రారంభం
– ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తోడ్పాటుతో ఆలయ పురోగతి
– రెనరేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్, సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని ప్రసిద్ద భావిగి భద్రేశ్వర దేవాలయ అభివృద్ధే ధ్యేయని దేవాలయ రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్‌ కుమార్, కమిటి సభ్యులు తెలిపారు. మంగళవారం చైర్మన్ పటేల్ కిరణ్‌, సభ్యులు దుకాణదారులతో కలిసి మాట్లాడారు.

భావిగి భద్రేశ్వర స్వామి దేవాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సహాకారంతో పాలకవర్గంలో తనకు చైర్మన్ పదవి బాధ్యతలు అవకాశం కల్పించారని గుర్తుచేశాఉ. ఆలయ కమిటీ సభ్యుల, వీరశైవ సమాజం సభ్యులు, తాండూరులో పలువురి ప్రముఖుల సూచనలు తీసుకుంటూ ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు.

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో దేవాలయ అభివృద్ధిని వేగవంతం చేయడం జరిగిందన్నారు. భద్రప్ప గుడి సాక్షిగా జరుగుతున్న అభివృద్ధికి ఆటంకాలు కలిగించాలని ఎన్ని దృష్ట శక్తులు అడ్డుపడినా, గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది సమాజం సభ్యుల కోరిక మేరకు దాసోహం కట్టి చూపించడం జరిగిందని అన్నారు.

దాసోహం పూర్తి అయినా వెంటనే తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ పూర్తి సలహా సూచనలతో పురాతనమైన షాపింగ్ కాంప్లెక్స్ శిథిలావ్యవస్థలో ఉందని గుర్తించి దుకాణదారులు ఇష్టపూర్వకంతో వాటి స్థానంలో నూతన కాంప్లెక్స్ నిర్మాణనికి కృషి చేయడం జరిగిందన్నారు. దుకాణదారుల అంగీకరించడంతో వీరశైవ సమాజం సభ్యుల సూచనలు, సలహాలతో పూర్తిగా దేవదాయ శాఖ నిబంధనలతో అధికారుల పరివేక్షణలో నూతన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం ప్రారంభించడం జరిగిందని స్పష్టం చేశారు.

దుకాణదారులు, అధికారులు, తాండూరు ప్రజలు పూర్తి సహాయ సహాకరాలు అందించడంతో అతి తక్కువ సమయంలోనే కాంప్లెక్స్ నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. త్వరలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. ఈ అభివృద్ధి పనులను రాజకీయంగా కొంత మంది ఓర్చుకోలేకపోతున్నారని,అభివృద్ధిని అడ్డుకోవాడని రోజు ఒక్క అబద్దాపు ప్రచారాలు తెర లెప్పడం వెనుక కుట్రలు దాగి ఉన్నాయని అన్నారు. ప్రజలందరూ ఈ కుట్ర రాజకీయలు గమనిస్తున్నారని, అలాంటి వారికీ ప్రజలే బుద్ది చెబుతారని, మేము ఆలయ కమిటిగా ఆలయ అభివృద్ధి మా జెండా గా పని చేస్తామని అన్నారు.

ఇదికూడా చదవండి…

ప్రజా సేవే ధ్యేయం..!