మహిమాన్వితం అయ్యప్ప మహా పడిపూజ
– ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
– లొంక నర్సింలు నివాసంలో పూజకు హాజరు
తాండూరు, దర్శిని ప్రతినిధి : అయ్యప్ప మహా పడిపూజ ఎంతో మహిమాన్వితం అని తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

బుధవారం తాండూరు కాంగ్రెస్ నాయకులు లొంక నర్సింలు నివాసంలో అయ్యప్ప మహా పడిపూజ నిర్వహించారు. పండితులు, అయ్యప్ప స్వాముల సమక్షంలో పూజ వైభవంగా జరిగింది. ఈ పడిపూజ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. అయ్యప్ప స్వామిని దర్శించుకుని పూజ నిర్వహించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ అయ్యప్ప స్వామి పడిపూజ ఎంతో మహిమాన్వితమని అన్నారు. అయ్యప్ప స్వామి కృపతో అందరు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఆయన వెంట మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ గాజీపూర్ నారాయణ రెడ్డి, బంటు మల్లప్ప, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

