తుల్జాభవాని మాతను దర్శించుకున్న శంకర్ యాదవ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ పరిధి ఇందిరానగర్‌లో వెలసిన శ్రీ తుల్జాభవాని మాతను తాండూరుకు చెందిన ప్రముఖ రియల్ ఏస్టేట్ వ్యాపారి, శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్ దర్శించుకున్నారు. మంగళవారం ఆలయంలో ఆలయ పంచమ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ యాదవ్ అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. మాజీ పీసీసీ సభ్యులు నర్సింలు బీసీ సంఘం నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్, ప్రేమ్ రాజ్, బీసీ సంఘం యూత్ ప్రెసిడెంట్ వాల్మీకి నరేష్, టైలర్ రమేష్ తదితరులో కలిసి అమ్మవారికి పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ధర్మకర్తలు సత్యనారాయణ, రమేష్ శంకర్ యాదవ్‌తో పాటు నాయకులను ఘనంగా సన్మానించారు.


