మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించండి…!
– 24వ వార్డు అభివృద్ధి జరగడం ఖాయం
– కోట్రిక నాగలక్ష్మీ కోసం కుటుంబ ప్రచారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : మీ ఇంటి ఆడబిడ్డగా కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న కోట్రిక నాగలక్ష్మీ శ్రీకాంత్ ను ఆశీర్వదించాలని మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య కోరారు. పట్టణంలోని 24వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ నుంచి కోట్రిక నాగలక్ష్మి శ్రీకాంత్ పోటీ చేస్తున్నారు.

ఆమె గెలుపుకోసం అత్త కోట్రిక విజయలక్ష్మీ, భర్త కోట్రిక శ్రీకాంత్ లు వార్డులో పర్యటిస్తూ విస్తృత పర్యటన చేస్తున్నారు. వార్డులోని బాలాజీ నగర్ ప్రజలతో మమేకం అయ్యారు. వార్డు ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కోట్రిక విజయలక్ష్మీ మాట్లాడుతూ కోట్రిక నాగలక్ష్మీని మీ ఇంటి ఆడబిడ్డగా గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో గెలిస్తే బాలాజీ నగర్ లోని పార్కులు, సీసీ రోడ్లు, డ్రైన్ల అభివృద్ధి చేయడం ఖయామని భరోసా అందించారు. కోట్రిక నాగలక్ష్మీ మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తానని అన్నారు. నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి చేస్తానని అన్నారు.

ఇదికూడా చదవండి…

