జోరు తగ్గని.. కారు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

జోరు తగ్గని.. కారు..!
– తాండూరులో 12 స్థానాల్లో గెలుపు
– కాంగ్రెస్‌ అభ్యర్థులకు గట్టి పోటీ
– టెన్షన్‌ పెట్టిన 9వ వార్డు ఫలితం
తాండూరు, దర్శిని ప్రతినిధి : పంచాయతీ ఎన్నికల్లో చూపించిన జోరును బీఆర్ఎస్ పార్టీ.. మున్సిపల్ ఎన్నికల్లో అదే స్పీడుతో ముందుకు సాగింది. తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చింది.

తాండూరు పట్టణంలోని 36వ వార్డులకు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 12 స్థానాలను కైవసం చేసుకుంది. శుక్రవారం తాండూరు పట్టణంలోని సెయింట్ మార్క్స్ స్కూల్లో జరిగిన లెక్కింపు రసవత్తరంగా సాగింది. 36వ వార్డులను దృష్టిలో ఉంచుకుని 12వ వార్డుల చొప్పున మూడు రౌండ్లలో ఎన్నికల ఫలితాలను వెల్లడించారు. మొదటి రౌండ్‌ నుంచి బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. పట్టణంలోని 1వ వార్డును గెలుపొందింది. మొదటి రౌండ్‌లోనే 6 స్థానాలను కైవసం చేసుకుని పట్టుసాధించింది. అనంతరం జరిగిన రెండు, మూడు రౌండ్లలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నువ్వా.. నేనా అన్నట్లుగా ఫలితాల లెక్కింపు సాగింది. చివరి మూడో రౌండ్‌లో 9వ వార్డు నుంచి పోటీ చేస్తన్న మాజీ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు ఫలితం తీవ్ర ఉత్కంఠతకు గురిచేసింది. చివరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 45 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది.

ఆమె భర్త, బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి ఓటమి పాలు కావడం విచారానికి గురిచేసింది. మున్సిపల్ ఎన్నికల్లో 1వ వార్డు దనసిరి నాగలక్ష్మీ, 6వ వార్డు అనిల్ కుమార్, 7వ వార్డు ఈర్షాద్, 8వ వార్డు జావిద్, 9వ వార్డు పట్లోళ్ల దీపా నర్సింలు, 13వ వార్డు సురేష్‌ నాయక్, 20వ వార్డు నవీన సంతోష్‌ గౌడ్, 25వ వార్డు నసీరా భాను, 31వ వార్డు యోగానంద్, 32వ వార్డు ఉమా మహేశ్వరీ, 34వ వార్డు పటేల్ సుప్రీత కరుణాకర్, 36వ వార్డు రూప రుద్రుపాటిల్ మొత్తం 12 మంది విజయం సాధించారు. చైర్మన్‌ అభ్యర్థిని పోగొట్టుకున్నా మ్యాజిక్‌ ఫిగర్‌ స్థానాలు దాటి చైర్మన్ పీఠం దక్కించుకోవాలనే ఆశలపై ఫలితాలు నీళ్లు చల్లాయి. మున్సిపల్‌లో బీఆర్ఎస్ వ్యవరించే పాత్రపై త్వరలో ప్రకటన చేసే అవకాశం ఉంది.

 

కౌంటింగ్‌.. కిరికిరి..!