తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్‌గా పట్లోళ్ల నర్సింలు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్‌గా పట్లోళ్ల నర్సింలు..!
– రేపో.. ఎల్లుండో.. ఉత్తర్వులు జారీకి అవకాశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్‌గా మాజీ డీపీసీ సభ్యులు, పట్లోళ్ల నర్సింలు నియామకం ఖరారు అయినట్లు కనిపిస్తోంది. రేపో.. ఎల్లుండో ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్‌గా ఉన్న సాయిపూర్ బాల్ రెడ్డి ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బాల్ రెడ్డి సతీమణి పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి చైర్ పర్సన్‌గా ఎన్నిక కావడడంతో ఒకే ఇంటికి రెండు పదవులు రావడం పట్ల బాల్ రెడ్డి తన చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు.

అదేవిధంగా మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ కోసం చేసిన త్యాగాలను గుర్తించి ఆయనకు మార్కెట్ కమిటి చైర్మన్ పదవిని ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కూడా పూర్తి స్పష్టతతో ఉన్నారు. పట్లోళ్ల నర్సింలుకే మార్కెట్ కమిటి చైర్మన్ పదవిని ఇప్పించేందుకు చొరవ తీసుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్ కమిటి చైర్మన్ పదవి కాలం ఇంకా 8 నెలలు మాత్రమే ఉందని అధికారులు చెబుతున్నారు. పట్లోళ్ల నర్సింలు చైర్మన్ పదవి చేపట్టిన తరువాత.. పదవి కాలాన్ని పొడగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.