తాండూరు పట్టణ అభివృద్ధే ధ్యేయం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు పట్టణ అభివృద్ధే ధ్యేయం..!
– పార్టీలకతీతంగా వార్డుల ప్రగతి
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– సాదాసీదాగా మున్సిపల్ సమావేశం
– మహిళ కౌన్సిలర్లకు, ఆర్పీలకు పలువురికి సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ అభివృద్ధ్యే ధ్యేయంగా పనిచేయాలని, పట్టణ అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.

సోమవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొత్తం 13 అంశాలతో కౌన్సిల్ సమావేశం ప్రారంభమయ్యింది. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో అన్ని అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది.

అనంతరం పలువురు కౌన్సిలర్లు తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, కౌన్సిల్‌ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు పట్టణ అభివృద్ధికి పాలకవర్గం సమిష్టిగా కృషి చేయాలన్నారు. తాండూరు పట్టణాభిద్ధి ధ్యేయంగా పనిచేయాలన్నారు. పార్టీలకతీతంగా అన్ని వార్డులను ప్రగతి బాటలో నడిపించేందుకు దృష్టిసారించాలని అన్నారు. అదేవిధంగా చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. అధికారులు కౌన్సిలర్లకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలని అన్నారు.

ఘనంగా మహిళ దినోత్సవం
మరోవైపు మున్సిపల్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవం జరుపుకున్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌ రెడ్డి, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, మహిళ కౌన్సిలర్లతో పాటు ఆర్పీలు, మహిళ సంఘాల ప్రతినిధులు, మున్సిపల్ మహిళ కార్మికులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కమీషనర్ మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు, పలు విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇంటి పనిలో ఘోరం