ప్రగతి బాట పట్టాలి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ప్రగతి బాట పట్టాలి..!
– 99రోజుల ప్రణాళిక సక్సెస్‌ చేయాలి
– ఇందిరమ్మ ఇళ్లపై ప్రత్యేక దృష్టిసారించండి
– ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పనులు పూర్తి చేయాలి
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్ష
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో అధికారులు గ్రామాలు, పట్టణాలను ప్రగతి బాట పట్టించే విధంగా దృష్టిసారించాలని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సూచించారు.

మంగళవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి అభివృద్ధి, పథకాల అమలును పర్యవేక్షించాలన్నారు.

అధికారులందరు సమన్వయం పాటించి.. నియోజకవర్గంలోని గ్రామాలను, తాండూరు పట్టణాన్ని ప్రగతి బాట పట్టించాలన్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. ఇప్పటికే ఇళ్ల నిర్మాణం పూర్తి అయితే ప్రారంభోత్సవాల(గృహప్రవేశం)కు ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రౌండింగ్ కాని ఇందిరమ్మ ఇళ్ల జాబితాను సిద్దం చేమయాలని అన్నారు. ఇందిరమ్మ పథకంలో పురోగతి సాధించేలా హౌసింగ్ ఏఈ, ఎంపీడీఓలు చర్యలు తీసుకోవాలన్నారు. ఎంజీఎన్ఆర్‌ఈజీఎస్ పనులు త్వరగా పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్దం చేయాలని అన్నారు. ఏదైనా సమస్య ఉంటే నా దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అనిత, మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి, డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, ఎంపీడీవోలు, ఎమ్మార్వో లు, మున్సిపల్ కమిషనర్, హౌసింగ్ ఏఈలు, అధికారులు, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు ఉన్నారు.

ఎమ్మెల్యేతో బీజేపీ కౌన్సిలర్ల భేటీ..!