నిబంధనలు పాటించకుంటే వేటు తప్పదు

కెరీర్ తాండూరు వికారాబాద్

నిబంధనలు పాటించకుంటే వేటు తప్పదు
– ప్రైవేటులో పుస్తకాల విక్రయం విరుద్ధం
– తనిఖీలు చేసిన జిల్లా విద్యాధికారి రేణుకాదేవి
– స్కూళ్లలో అర్హతలేని ఉపాధ్యాయులపై ఆరా
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేటు స్కూళ్లను నిర్వహించాలని, లేదంటే వేటు తప్పదని వికారాబాద్ జిల్లా విద్యాధికారి రేణుకా దేవి పేర్కొన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని పలు ప్రైవేటు స్కూళ్లలను జిల్లా విద్యాధికారి రేణుకాదేవి తాండూరు విద్యాధికారి వెంకటయ్య గౌడ్ తో కలిసి తనిఖీ చేశారు. ఇదివరకే ప్రైవేటు స్కూళ్లలో పుస్తకాలు, వస్తువులు విక్రయించడంతో పాటు అర్హత, శిక్షణ లేని టీచర్లతో బోధన సాగిస్తున్నారనే ఆరోపణలపై ఈ తనిఖీలు చేశారు. నేతాజీ గురుకుల్, సెయింట్ మార్క్ తదితర పాఠశాలలో టీచర్ల అర్హత, ట్రైనింగ్ గురించి ఆరా తీశారు. ఆయా పాఠశాలలో పుస్తకాల విక్రయాలను గుర్తించి గదులను సీజ్ చేయించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రవేటు పాఠశాలలు అన్ని ప్రభుత్వ జీఓ నిబంధనలు పాటించాలన్నారు. మరుగుదొడ్లు, క్రీడా మైదానాలను ఏర్పాటు చేసుకొ చాలన్నారు. పాఠశాలల నిర్వహకులు విద్య పేరుతో తల్లిదండ్రులపై భారం మోపరాదన్నారు. అన్ని పాఠశాలలు శిక్షణ పొందిన, విద్యార్హత టీచర్లను నియమించుకోవాలన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్ల అర్హత సర్టిఫికెట్లను అందజేయాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవారికి నోటీసులు అందజేసి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలో పుస్తకాలను విక్రయించడం నిషేధమన్నారు. అమ్మకాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు. తనిఖీల అనంతరం జిల్లా విద్యాధికారి తాండూరులోని ప్రైవేటు స్కూళ్ల యజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రిన్సిపల్లు, విద్యార్థి విభాగం నాయకులు తదితరులు ఉన్నారు.