మీతోనే ఉంటాం.. బీఆర్ఎస్ లోనే ఉంటాం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మీతోనే ఉంటాం.. బీఆర్ఎస్ లోనే ఉంటాం..!
– గులాబీ పార్టీని వీడే ప్రసక్తే లేదు
– పైలెట్ రోహిత్ రెడ్డితో కౌన్సిలర్ల భేటీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : మీతోనే ఉంటాం.. బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతామని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో ఆ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు తేల్చి చెప్పారు. శుక్రవారం పట్టణంలోని రోహిత్ రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 13 మంది కౌన్సిలర్లు ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గత కొన్ని రోజుల నుంచి అధికార పార్టీ నుంచి పార్టీ మారాలని ఒత్తిళ్ళు వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రోహిత్ రెడ్డి ముందు ఇదే విషయం ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్బంగా కౌన్సిలర్లు తమ అభిప్రాయంను పంచుకున్నారు.

 

అధికార పార్టీ నుంచి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. మీతోనే ఉంటాం, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కౌన్సిలర్లను పార్టీ మారాలని ప్రలోభ పెట్టినా, ఒత్తిడి తెచ్చినా ఊరుకోమన్నారు. పార్టీ కౌన్సిలర్లకు అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్యు(నయూం), ఫ్లోర్ లీడర్ శోభారాణి, మాజీ వైస్ చైర్మన్ అసిఫ్, కౌన్సిలర్లు మంకాల్ రాఘవేందర్, శ్రీనివాస్ రెడ్డి, సంగీత ఠాకూర్, సింధుజా గౌడ్, అస్లాం, ముక్తార్ నాజ్, నాయకులు పెట్లోళ్ల నర్సిములు, మాజీ ఫ్లోర్ లీడర్ సుమిత్ గౌడ్, ఎర్రం శ్రీధర్, గుండప్ప తదితరులు ఉన్నారు.

 

ఇదికూడా చదవండి…

కాంగ్రెస్ పార్టీలో చేరిన జుబేర్ లాల