ఆస్తి పన్నుల వసూళ్లే టార్గెట్..!
– ఆలస్యం చేస్తే గ్రాంట్లు నిలిచిపోయే చాన్స్
– అమృత్ 2.0పనులు వేగవంతం చేయాలి
– ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక నోడల్ అధికారి ఎన్.విశాల్ రాజు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆస్తి పన్నుల వసూళ్లలో తాండూరు మున్సిపల్ వెనుకబడి ఉందని, కలెక్షన్‌ల విషయంలో స్పీడ్ పెంచాలని వికారాబాద్ జిల్లా ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక పట్టణ అభివృద్ధి శాఖ నోడల్ అధికారి, అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్.విశాల్ రాజ్ అన్నారు.

మంగళవారం తాండూరు మున్సిపాలిలో కొనసాగుతున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, కమీషనర్ మధుసూదన్ రెడ్డిలతో కలిసి పాల్గొని పరిశీలించారు. శాంతినగర్ పార్క్ లో పార్కు క్లీనింగ్ కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్తిపన్ను వసుల్లో తాండూరు మున్సిపాలిటీ వెనుకబడి ఉందని వేగం పెంచాలని వార్డు ఆఫీసర్లను, బిల్ కలెక్టర్లను ఆదేశించారు. లక్ష్యాలకు అనుగుణంగా పన్నులు వసూలు చేయకపోతే రాష్ట్ర, కేంద్ర గ్రాంట్లు నిలిచిపోయే అవకాశం ఉంటుందని అన్నారు.

యూడీఎఫ్ పనులు, అమృత్ 2.0, పనులపై ఇంజనీరింగ్ విభాగం అధికారులు అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీకి సంబంధించి యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని సూచించారు. అంతకుముందు ఆయన డంపింగ్ యార్డ్ లో బయో మైనింగ్ పనులను, డి అర్ సి సెంటర్, ఏబీసీ సెంటర్‌ను పరిశీలించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద చేపడుతున్న పనులపై ఆరా తీశారు. అమృత్ 2.0 కింద చేపడుతున్న (2) వాటర్ ట్యాంకులను పరిశీలించారు. ఆయన వెంట మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, కౌన్సిలర్ మల్లేశం, ఏఈ కాజా హుస్సేన్, ఉదయ్ కుమార్, టీపీబీఓలు ప్రియా, నరేష్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ప్రవీణ్ గౌడ్ తదితరులు ఉన్నారు.


