విత్తన మట్టి గణపతిని పూజించాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

విత్తన మట్టి గణపతిని పూజించాలి
– హరిసేన ఆధ్వర్యంలో ఇంటింటికి పంపిణీ
– తాండూరు సబ్ కలెక్టర్, డీఎస్పీలకు అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయక చవితికి విత్తన మట్టి గణపతిని పూజించాలని హరిత సేన ఆధ్వర్యంలో వినాయకులను పంపిణీ చేశారు. వినాయక చవితిని పురస్కరించుకుని మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా హరిత సేన కార్యక్రమంలో భాగంగా మంగళవారం తాండూరులో ఉత్సహాంగా విత్తన మట్టి వినాయకుల పంపిణీ జరిగింది.
kvcs
హరిత సేన వికారాబాద్ జిల్లా అధ్యక్షురాలు, తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ ఆధ్వర్యంలో వినాయకులను పంపిణీ చేశారు. తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, డీఎస్పీ బాలకృష్ణారెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిసి వినాయకులను అందించారు. అదేవిధంగా తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలుతో పాటు తాండూరు పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు, నాయకుల ఇంటింటికి వెళ్లి విత్తన మట్టి గణనాథులను అందజేశారు.

ఈ సందర్భంగా కోట్రిక విజయలక్ష్మీ మాట్లాడుతూ పర్యావరణ హితం కోసం విత్తన మట్టి వినాయకులను పూజించాలని కోరారు. పూజించిన మట్టి వినాయకులను విత్తనంతో నిమజ్జనం చేసి వృక్ష సంపదను పెంచేందుకు తోడ్పడాలన్నారు. ప్రకృతిని కాపాడితే దైవానుగ్రహం మెండుగా అందరిపై ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మహిళ నాయకురాలు శకుంతల, పోటీ మహారాజ్ దేవాలయ మాజీ చైర్మన్ తర్లపల్లి భాను తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

జీవితాలను మార్చే ఏటీసీ..!