సోదర భావానికి ప్రతీక ఇప్తార్..!
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– క్యాంపు కార్యాలయంలో ఇఫ్తార్ విందు
తాండూరు, దర్శిని ప్రతినిధి : సోదర భావానికి రంజాన్ ఇప్తార్ విందు ప్రతీకగా నిలుస్తాయని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు.

గురువారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మైనార్టీ యువ నాయకుడు అమీర్ అబ్దుల్లా ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇందులో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపవాసం దీక్షలో ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు. అనంతరం ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్షను విరమింప జేశారు.

ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇఫ్తార్ విందులు సోదర భావానికి ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కోఆర్డీనేటర్ కరణం పురుషోత్తంరావు, మర్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, మాజీ డీసీసీబీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, నాయకులు సురేందర్ రెడ్డి, నర్సిరెడ్డి, లొంక నర్సింలు, లింగదలి రవి కుమార్, నారయణ రెడ్డి, సమీర్, వసీంతో పాటు మత పెద్దలు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.


