ఆర్యవైశ్యుల అభివృద్ధే ధ్యేయం..!
– రెండేళ్ల పనులు చూసి ఆదరించండి
– ఎన్నికల ప్రచారంలో కోడూరు ప్యానల్ జోరు
– మెజార్టీ ఓట్లతో గెలుపుపై ధీమా
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆర్యవైశ్యుల అభివృద్ధే తమ ధ్యేయమని కోడూరు వినోద్ కుమార్ ప్యానల్ సభ్యులు అన్నారు. తాండూరులో ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి.

2026-28 సంవత్సరానికి గాను పోటీలు జరుగుతుండగా ఈ సారి సంఘం అధ్యక్ష పదవికి కోడూరు వినోద్ కుమార్, ఉపాధ్యక్షులుగా గుడుపల్లి అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా రొంపల్లి సంతోష్ కుమార్ సహాయ కార్యదర్శిగా గుముడాల గౌరీ శంకర్, కోశాధికారిగా అయిత విజయ్ కుమార్‌లు పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో కోడూరు వినోద్ కుమార్ ప్యానల్ సభ్యులకు వైశ్యులు బ్రహ్మరథం పడుతున్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని శుక్రవారం కోడూరు వినోద్ కుమార్ ప్యానల్ సభ్యులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ ప్యానల్‌కు అధ్యక్షులు అలంపల్లి శ్రీనివాస్ మద్దతు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కోడూరు వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి రొంపల్లి సంతోష్ కుమార్‌లు మాట్లాడుతూ రెండేళ్ల కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. సంఘం భవనం, ఏసి ఫంక్షన్ హాల్, అమ్మవారికి వెండి కీరీటం, సంఘం సభ్యుల ఐక్యతకు ఎంతో కృషి చేయడం జరిగిందని గుర్తుచేశారు. శుభకార్యాలలో, అశుభ కార్యాలలో ఎల్లప్పుడు అందుబాటులో ఉండడం జరిగిందన్నారు. వాటిని గుర్తించుకుని ఎన్నికల్లో భారీ మెజార్టీ అందించాలని కోరారు. ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, మెజార్టీ ఓట్లతో తమ ప్యానల్ గెలుపు సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, యువకులు పాల్గొన్నారు.


