దొంగగా మారిన ఆటో డ్రైవర్..!
– అంతర్‌జిల్లాలలో బైకులు చోరీ
– ఒకే ఊరిలో 10మంది విక్రయం
– నిందితుని నుంచి 15 బైకులు స్వాదీనం
– పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడిలా
తాండూరు, దర్శిని ప్రతినిధి : జీవనోపాధి కోసం ఆటో నడుపుకునే డ్రైవర్ జల్సాల కోసం దొంగగా మారాడు. హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాలలో బైకులు చోరీలు చేస్తూ విక్రయించి సోమ్ము చేసుకుంటున్న ఈ దొంగ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. పోలీసుల విచారణలో నిందితుడి నుంచి 15 బైకులను స్వాదీనం చేసుకున్నారు. ఇందులోని 10 బైకులను ఒకే ఊరిలో విక్రయించడం గమనార్హం. గురువారం తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

యాలాల మండలం కమాల్పూర్ గ్రామానికి చెందిన బోయిని శ్రీకాంత్ (24) ఆటో డ్రైవర్గా పనిచేసేవాడు. జల్సాల కోసం బైకు చోరీలకు ఆలవాటు పడ్డాడు. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాలలో 15 మోటారు బైకులను చోరీ చేశాడు. ఇలా చోరి చేసిన వాటిలో 10 బైకులను తాండూరు మండలం బిజ్ఞారం గ్రామస్తులకు విక్రయించాడు. ఓ నాలుగు బైకులను తరువాత అమ్మేందుకు స్వగ్రామంలోని ఇంటి వద్ద ఉంచుకున్నాడు. మిగతా ఒక దానిని వాడుకుంటున్నాడు. గురువారం ఉదయం వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఆదేశాలతో తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్ సూచన మేరకు పట్టణంలోని విలియమూన్ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బైకుపై వచ్చిన శ్రీకాంత్ పోలీసులకు పట్టుపడ్డాడు.

బైకు వివరాలను అడగగా ఎలాంటి పత్రాలు లేకపోవడంతో పోలీస్టేషన్కు తరలించి విచారణ చె పెట్టారు. దీంతో శ్రీకాంత్ చోరీల చిట్టా బయటపడింది. బిజ్ఞారంలో విక్రయించిన 10బైకులు, ఇంటి వద్ద ఉంచిన 4 బైకులు, నడుపుతున్న 1 బైకుతో పాటు మొత్తం 15 బైకులను స్వాదీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 7లక్షల 50వేలు ఉంటుందని సీఐ సంతోష్ కుమార్ తెలిపారు. దొంగిలించిన మోటార్ సైకిల్ లలో 5 మోటార్ సైకిల్ సంబందించి తాండూర్ పోలీస్ స్టేషన్ నందు ఒక కేసు, సైబరాబాద్ పోలీసు కమిషనరేటు పరిదిలోని అల్లాపుర్, చందానగర్ పోలీసు స్టేషన్ లనందు 4 కేసులు నమోదు అయ్యాయి. గతంలో కూడా ఇట్టి నేరస్తుడు యాలాల, కూకట్పల్లి , మియాపూర్, సనత్ నగర్, బంజారాహిల్ల్స్, బాచుపల్లి, చందానగర్ మరియు మాదాపూర్ పోలిసే స్టేషన్ లలో నమోదు అయిన సుమారు 20 కేసులలో జైలుకు వెళ్ళిరావడం జరిగిందని వివరించారు. మరోవైపు బైకు దొంగను పట్టుకోవడం పట్ల జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తనతో పాటు ఎస్ఐ మహ్మమద్ అబ్దుల్ సాజిద్, క్రైం పార్టీ సిబ్బంది అంజద్, శివకుమార్, సాయప్ప, షబ్బీల్ లను అభినందించినట్లు తెలిపారు. నిందితున్ని కోర్టులో హాజరు పరిచి రిమాండుకు తరలించినట్లు వెల్లడించారు.

ఇదికూడా చదవండి…

