పరీక్షలంటే ‘టెన్’షన్ వద్దు..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

పరీక్షలంటే ‘టెన్’షన్ వద్దు..!
– ఒత్తిడిని జయిస్తే విజయం మీదే
– ఆత్మవిశ్వాసంతో ఎగ్జామ్స్ రాయండి
– కాంగ్రెస్ నాయకులు పటేల్ కిరణ్‌ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులు పరీక్షలంటే టెన్షన్ పడాల్సిన పనిలేదని, ఆత్మ విశ్వాసంతో సిద్దమైతే విజయం మీదే అని తాండూరు కాంగ్రెస్ నాయకులు, భద్రేశ్వర దేవాలయ రెనవేషన్ కమిటి మాజీ చైర్మన్, ది గ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పటేల్ కిరణ్‌ కుమార్ అన్నారు.

శనివారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న సందర్భంగా విద్యార్థులలో కాన్ఫిడెన్స్‌ నింపే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలు అంటే భయపడ వద్దని అన్నారు. ఆత్మ విశ్వాసంతో పరీక్షలకు సిద్దమైతే విజయం వరిస్తుందని అన్నారు. పరీక్షలకు సిద్దమయ్యే విద్యార్థులు ప్రణాళిక బద్దంగా సాగాలన్నారు. పరీక్షల్లో చదువుకున్న పాఠ్యాంశాలను గుర్తుచేసుకుని ఏకాగ్రతతో ప్రశ్నలకు జవాబులు రాయాలని, అప్పడే మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారని అన్నారు.

పరీక్షల సమయంలో సెల్‌ఫోన్‌, టీవీ వైపు మనస్సు మరలకుండా చూసుకోవాలని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా విద్యార్థిలో ఆత్మ విశ్వాసం పెంపొందించేందుకు ప్రతిక్షణం కృషి చేయాలని అన్నారు. అవసరమైన ధైర్యం అందివ్వాలన్నారు. పరీక్షల సమయంలో వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులకు ఆల్‌ ది బెస్ట్ చెప్పారు.

మత సామరస్యతను చాటే రంజాన్‌..!