తోఫాలో తొండేషాలు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

తోఫాలో తొండేషాలు..!
– కిట్ల పంపిణీలో కాంగ్రెస్ స్వార్థం
– బీఆర్ఎస్ కౌన్సిలర్ల పట్ల చిన్నచూపు
– అభ్యంతరం వ్యక్తం చేసిన కౌన్సిలర్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రంజాన్ పండగ తోఫా పంపిణీలో కాంగ్రెస్ పార్టీ తొండి రాజకీయాలకు పాల్పడుతుందని తాండూరు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు విమర్శించారు.

శనివారం తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఈర్షాద్, అనిల్, యోగానంద్, నాయకులు సంతోష్‌ గౌడ్, ఎజాజ్ తదితరులు మీడియాతో మాట్లాడారు. తాండూరు పట్టణంలో జరుగుతున్న రంజాన్‌ తోఫా పంపిణీలో కాంగ్రెస్ కౌన్సిలర్లకు ఇచ్చిన ప్రాధాన్యతను బీఆర్ఎస్ పార్టీకి కౌన్సిలర్లకు ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పట్టణంలో పార్టీలకతీతంగా కౌన్సిలర్లకు ప్రాధాన్యం ఉంటుందని మీడియా ముందు ప్రగల్బాలు పలికారని, కిట్ల పంపిణీలో ఎమ్మెల్యే హామిలకు ప్రాధాన్యం లేకుండా పోయిందని విమర్శించారు.

అదేవిధంగా పట్టణంలో ప్రతి వార్డులో వందల కొద్ది ముస్లిం సోదరులు ఉంటే 150-200ల మద్యలోనే కిట్లను పంపిణీ చేస్తున్నాని ఆరోపించారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు, ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులు కిట్ల పంపిణీలో స్వార్థం ప్రదర్శిస్తున్నారని దుయ్యబట్టారు. తోఫా పంపిణిలో ముస్లిం కుటుంబాలకు న్యాయం జరగడం లేదని అన్నారు. కిట్ల పంపిణీలో ఎంతమందికి న్యాయం చేస్తన్నారని ప్రశ్నించారు. మైనార్టీల వల్లే అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం.. వారికే అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలే బుద్ది చెప్పడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువనాయకులు ఇంతియాజ్ తదితరులు ఉన్నారు.

హిందూ సమ్మేళనంలో పాల్గొందాం రండి..!