విద్యార్థుల కోసం బస్సులను నడపాలి
– బస్టాండ్‌లో పాస్ కౌంటర్‌ను ఏర్పాటు చేయాలి
– బీసీ సంఘం తాండూరు నియోజకవర్గ కన్వీనర్ రాజ్‌కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : గ్రామాల నుంచి వచ్చే ప్రతి విద్యార్థి కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను నడిపించాలని బీసీ సంక్షేమ సంఘం తాండూరు నియోజకవర్గ కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద విద్యార్థులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. డీపో ముందు వందల మంది విద్యార్థులతో కలిసి సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు బస్సు సౌకర్యాలు లేక కాలేజీలకు స్కూల్లో సమయానికి చేరుకోలేక పోతున్నారని అన్నారు. దీంతో విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. ఆర్టీసి డిపో మేనేజర్, అధికారులు విద్యార్థుల కోసం ఉదయం, సాయంత్రం ప్రత్యేక బస్సులు నడిపించాలన్నారు.
అనంతరం విద్యార్థుల బస్‌పాస్‌ల కోసం ప్రత్యేకమైన కౌంటర్, క్యూలైన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ గారికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ నాయకులు సయ్యద్ షుకూర్, మండల అధ్యక్షులు లక్ష్మణాచారి, జగన్, తాండ్ర నరేష్, గడ్డం వెంకటేష్, బీసీ సంఘం పట్టణ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గౌడ్, నాయకులు బసవరాజ్, మతిన్, అఖిల్, విద్యార్థి నాయకులు శ్రీకాంత్, వంశీ, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

