తాండూరు పట్టణ వాసులకు సూపర్ చాన్స్..!
– ఆస్తిపన్ను చెల్లింపులో 5శాతం రాయితీ పొందే అవకాశం
– గడువు, చెల్లింపుల వివరాలు ఇవే
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ వాసులకు మున్సిపల్ అధికారులు సూపర్ చాన్స్ ఇస్తున్నారు. ఆస్తి పన్నులు ముందుగానే చెల్లిస్తే అందులో 5శాతం రాయితీ పొందే అవకాశాన్ని కల్పిస్తోంది.

ఈ అవకాశాన్ని ఎక్కడ.. ఎలా.. ఉపయోగించుకోవాలో తెలుసుకోండి. ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసిన తరువాత మున్సిపాల్టీలలో ఆస్తిపన్నులను ముందుగానే రాబట్టేందుకు ఎర్లీబర్డ్ స్కీంను అమలు చేస్తోంది. తాండూరు మున్సిపల్లో కూడా ఎర్లీబర్డ్ స్కీంను అమలు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2026-27) మొత్తం ఆస్తి పన్ను ముందుగానే చెల్లించాలి.

ఇలా ముందుగానే చెల్లిస్తే పన్ను మొత్తంలో 5% రాయితీ (గరిష్ట పరిమితి లేదు) కల్పిస్తోంది. ఈ గడువు ఈనెల 30వ తేది వరకు ఉంటుంది. పాత బకాయిలు (Arrears) ఉంటే వారికి ఈ రాయితీ వర్తించదు. ఈఅవకాశాన్ని వినియోగించుకోవాలని అనుకునేవారు తాండూరు మున్సిపల్‌లో లేదా బిల్ కలెక్టర్లకు చెల్లించవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమీషనర్ మధుసూదన్ రెడ్డి సూచించారు.


