సాయిపూర్ యువ కిశోరం బంటు వేణు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

సాయిపూర్ యువ కిశోరం బంటు వేణు..!
– అట్టహాసంగా జన్మదిన వేడుకలు
– శుభాకాంక్షలు తెలిపిన ఆర్బీఓఎల్ శ్రీనివాస్ రెడ్డి
– సన్మానించిన నేతలు, అభిమానులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలోని సాయిపూర్ 11వ వార్డు కు చెందిన పేదల పెన్నిధి, యువకిశోరం కాంగ్రెస్ నేత బంటు వేణుగోపాల్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు స్నేహితులు, కాలనీవాసులు అందరూ కలిసి ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
kvcs
సాయంత్రం పట్టణంలోని సాయిపూర్ కాలనీ 11వ వార్డులో ఏర్పాటుచేసిన జన్మదిన వేడుకలకు ఆర్.బి. ఓ. ఎల్ అధినేత బుయ్యని శ్రీనివాసరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మంచికి మారుపేరుగా నిలుస్తూ, కాలనీ సంక్షేమంతో పాటు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేసే వేణుగోపాల్ మున్ముందు మరిన్ని పదవులు చేపట్టి నిండు నూరేళ్లు వర్ధిల్లాలని శ్రీనివాసరెడ్డి యువనేతను ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో వేణుగోపాల్ అభిమానులు, స్నేహితులు, కాంగ్రెస్ పార్టీ నేతలు తదితరులు భారీ ఎత్తున హాజరయ్యారు. ఇదిలా ఉండగా వేణుగోపాల్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన అభిమానులు సాయిపూర్ లోని 11వ వార్డులో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఎప్పుడు పేదల కోసం పరితపించే తమ యువ నేత నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఆర్ బి ఓ ఎల్ అధినేత శీనన్న సహకారంతో 11వ వార్డును పట్టణంలోని ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా కాలనీవాసులకు తెలియజేశారు. తనపై ఇంత అభిమానం చూపిన శీనన్నతో పాటు, కాలనీవాసులకు అభిమానులు,స్నేహితులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా వేణు గోపాల్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, మేస్త్రి రాములు, బంటుమల్లప్ప జుబేర్ లాల, వికాస్ జోషి, సంపల్లి శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

పనికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం