మున్సిపల్, ఏఎంసీ చైర్మన్‌లకు సత్కారం

తాండూరు రాజకీయం వికారాబాద్

మున్సిపల్, ఏఎంసీ చైర్మన్‌లకు సత్కారం
– సన్మానించిన ది గ్రేన్, సీడ్స్ మర్చంట్స్‌ అసోసియేషన్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్‌లను సన్మానించారు.

బుధవారం తాండూరు ది గ్రేన్ అండ్‌ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్‌లను పూల మాల, శాలువాతో సత్కరించి సన్మానించారు.

ఈ సందర్భంగా చైర్మన్లు మాట్లాడుతూ తాండూరు గంజ్ వ్యాపారుల అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సభా అధ్యక్షులు బిక్కనెళ్లి శ్రీధర్, కార్యదర్శి పటేల్ కిరణ్‌ కుమార్, కోశాధికారి బానకారి క్రిష్ణ, మాజీ చైర్మన్లు పటేల్ శ్రీశైలం, కల్వ రాధాక్రిష్ణ, బంటారం సుధాకర్, కట్కం వీరేందర్, మంకాల రవీందర్, అసోసియేషన్ సభ్యులు, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.

తాండూరు పట్టణ వాసులకు సూపర్ చాన్స్..!