దత్తాత్రేయుని సేవలో విఠల్‌ నాయక్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

దత్తాత్రేయుని సేవలో విఠల్‌ నాయక్..!
– భక్తులకు అన్నదానం చేసిన ఏఎంసీ మాజీ చైర్మన్
తాండూరు, దర్శిని ప్రతినిధి : కర్ణాటకలోని గాన్గాపూర్‌లో వెలసిన దత్తాత్రేయ స్వామి సేవలో తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ తరించారు.

గురువారం పౌర్ణమి సందర్భంగా దత్తాత్రేయ స్వామిని విఠల్ నాయక్ దర్శించుకున్నారు. ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులకు విఠల్ నాయక్ అన్నదానం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని అలవర్చు కోవాలని సూచించారు. అన్ని దానాలకన్నా అన్నసమర్పణ గొప్పదన్నారు. అందుకే ప్రతి నెల పౌర్ణమిన దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని అన్నదానం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ నాయక్, ఆలయ పూజారులు భరత్, కిరణ్, భక్తులు తదితరులు ఉన్నారు.

 

రసాభసాగా గాజీపూర్ గ్రామసభ..!