జిల్లాలో 144 సెక్షన్‌..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

జిల్లాలో 144 సెక్షన్‌..!
– రేపటి నుంచి అమల్లోకి
– ప్రకటించిన జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఐపీఎస్
వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలో 144 సెక్షన్‌ అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఐపీఎస్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 144 సెక్షన్ అమలు చేయడం జరుగుతుందని ఓ ప్రకటనలో తెలిపారు. 13 న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లాలో శాంతిభద్రతలకు సంబందించి ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా 11వ తేది సాయంత్రం 6:00 గంటల నుండి 13వ తేది సాయంత్రం 6:00 గంటల వరకు జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.

జిల్లాలో ఎవరు కూడా నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుంపులు గుంపులుగా తిరగవద్దని సూచించారు. బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధంలో ఉంటాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ రోజున ఎవ్వరు కూడా పోలింగ్ కేంద్రాల చుట్టూ గుమికూడి ఉండరాదన్నారు. పోలింగ్ స్టేషన్ దగ్గరలో 100 మీటర్స్ లైన్స్ దాటి ఎవ్వరు లోపలికి రావద్దని, జిల్లాలో ప్రజలు ఇట్టి విషయం పైన దృష్టి సరించి పోలీస్ అధికారులకు సహకరించాలని సూచించారు. ఎవరైనా అధికారుల నియమ నిబంధనలను పాటించకుండా ఇబ్బందులకు గురిచేసే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

ఇదికూడా చదవండి…

వెల్‌కమ్‌ స్పీకర్ సార్..!