ఇంటి నుంచే ఎస్‌ఐఆర్‌..!

జాతీయం టెక్నాలజీ తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

ఇంటి నుంచే ఎస్‌ఐఆర్‌..!
– ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే ఛాన్స్‌
– అదోక్కటి ఉంటే 10 నిమిషాల్లో పూర్తి
– కొత్త కార్డులు ఎప్పుడు వస్తాయంటే..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్‌లో ఓటర్లు తమ ఓటును కాపాడుకునేందుకు ఆరాట పడుతున్నారు. ఎన్నికల సంఘం అందించిన ఫారాలు నింపేందుకు పరుగులు పెడుతున్నారు.

బీఎల్‌ఓలు, అంగన్ వాడి టీచర్ల వద్దకు వెళ్లి పడిగాపులు కాస్తున్నారు. అయితే ఎస్‌ఐఆర్ ఫారాలను ఆన్‌లైన్‌లో నింపే అవకాశం ఉంది. కాని దీనికి వ్యక్తి యొక్క ఓటర్‌ కార్డు మోబైల్‌ నెంబర్‌లో లింక్‌ అయి ఉండాలి. అలా లింక్‌ అయి ఉంటేనే ఆన్‌లైన్ ద్వారా ఎస్‌ఐఆర్‌ ఫారం నింపవచ్చు.

ఆన్‌లైన్‌లో చేసే విధానం ఇలా..
ఆన్‌లైన్‌లో సబ్‌మిట్ చెయ్యడానికి voters.eci.gov.inకి సైట్‌కి వెళ్లండి. ఓటర్ కార్డుపై ఉండే EPIC నంబర్‌తో లాగిన్ అవ్వండి.

ఎన్యూమరేషన్ ఫారం (Enumeration Form) నింపండి. తర్వాత.. మొబైల్‌కి OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చెయ్యండి, ఆధార్ e-Sign జరుగుతుంది. ఆ తర్వాత మీ పేరు ఆధార్‌తో మ్యాచ్ అయితే సులువుగా పని అయిపోతుంది. అంటే మీ సర్ ప్రక్రియ పూర్తైనట్లే. కొత్త ఓటర్లు Form-6 ఉపయోగించండి. మైగ్రెంట్‌లు, NRIలకు ప్రత్యేక ఆప్షన్లు ఉన్నాయి. దీని ద్వారా ఇంటి దగ్గరే ఉండి.. మీరు ఆన్‌లైన్‌లో 10 నిమిషాల్లో ఈ పనిని పూర్తి చేసుకోవచ్చు.

ఫారాలు రాకుంటే..
అధికారులు ఇంటికి వచ్చి ఫారాలు ఇవ్వకపోతే లేదా ఇంటికి రాకపోతే ప్రజలకు ఉన్న ఆప్షన్లు ఏమిటి? అనేది చూస్తే.. 1950 టోల్ ఫ్రీకి కాల్ చేయండి లేదా CEO వెబ్‌సైట్‌లో బుక్ ఎ కాల్ విత్ BLO అనే ఆప్షన్ ఎంచుకోండి. లేదా ERO లేదా DEO కార్యాలయాల్లో సమస్యలు చెప్పవచ్చు. రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లను కలిసి సహాయం అడగండి. ఈ అవకాశాల్ని ఉపయోగించి మీ ఓటును నిరూపించుకోండి.

ముసాయిదా జాబితాలో పేరు రాకుంటే..
భారత ఎన్నికల సంఘం ఈనెల 31న కొత్త ఓటర్లకు సంబంధించిన ముసాయిదా జాబితాను ప్రకటించనుంది. వచ్చేనెల ఆగస్టులో కొత్త ఓటర్ల వివరాలు వస్తాయని అంటున్నారు. ఎన్యూమరేషన్‌ ఫారాన్ని సమర్పించినా.. ముసాయిదాలో పేరు రాకుంటే.. ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో ఈఆర్‌వోకు అప్పీలు చేసుకోవచ్చు. ఒకవేళ తప్పుడు వివరాలు అందించినట్లు అయితే సంబంధిత ఓటర్లకు నోటీసులు జారీ చేస్తారు. అలా నోటీసు వస్తే ERO ముందు సంబంధిత పత్రాలైన ఆధార్, వోటర్ ID, రెసిడెన్స్ ప్రూఫ్, బర్త్ సర్టిఫికెట్ తీసుకెళ్లండి. తద్వారా మీది నిజమైన ఓటు అని నిరూపించుకున్నట్లు అవుతుంది.

ఉచితంగా బైకు, స్కూటీలు..!